27 December, 2012

మరణించే వారెవరో
జన్మించే వారెవరో
ఎవ్వరికీ తెలియదు
ఎప్పటికీ తెలియదు
ఎందుకంటే...
సృష్టిని రచించినవాడు
లిపిని నేర్పకుండానే మరణించాడు. 

21 November, 2012

సమస్త ప్రాణనదులు
ప్రవహించె ఈమరణసముద్రంలోనికి ,

అంతటితో ఆగక
సముద్రంలో ఓ సుడిగుండం లేచి
ఆత్మలు రూపం తొడిగి
ప్రాణాన్ని ప్రతిష్టించె.
   
ఎవరి నాన్నో
నేడు ఎవరికో అన్న
ఎవరి తల్లో
నేడు ఎవరికో చెల్లి. 

నదుల ప్రవాహం ఆగదు
సముద్రం ఎన్నటికీ నిండదు. 

30 October, 2012

పొయేవారు పోతూ
జీవం నాటిపొయారు
జీవితపు పొలాన.

జీవం మొలిచింది
ఓ జీవితమై ఎదిగింది
వార్ధక్య గాలులకు
వొరిగిపొతూ...వొరిగిపొతూ...
మరో జీవం నాటిపొయింది.
స్వజాతిపై
మనిషి మమతకు అంతెక్కడుంది! 

08 June, 2012

నాకలలకు రూపమే ఉండుంటే  
ఈ విశ్వమంతా నా కలలతో నిర్మించబడేది
ఆమెను గూర్చిన కలల కట్టడాలతో...

నా తలపులు చినుకులైతే
భూమి సంపూర్నంగా నీటిలో మునిగిఉండేడి  
ఆమెను గూర్చిన వలపుల తలపుల నీటిలో...  

19 February, 2012

మతాలు కులాలు
మనసుకు వేసిన సంకెల్లు
మనసైన మనషులను
కలుసుకోనీవు
కలిసిన మనషులను
నిలకడగ బతకనీవు.  

12 February, 2012

అండలూసియా ఆకాశంక్రింద
నారింజ వనంనడుమ  
వసంతంలో ఓరేయిన
జ్ఞాపకాలయానికెల్లి
ఓ జ్ఞాపకాన్ని తిరగేస్తే...
అది ఓ జరిగిన కథ
ఆదిలోనే అంతమైన కథ.

పాంప్లొనా వీధుల్లొ
వెన్నెలకురిసిన రాత్రుల్లో 
ఒక ఆంధ్రా అబ్బాయి
ఓ అందమైన అమెరికా అమ్మాయి 
ప్రేమబాసలు చెసుకున్నారు
భాషలు అర్థంకాకున్న.
ప్రకృతి వారి ప్రేమబాసల్ని
వినిందో ఏమో
ప్రకృతికి వారిపై
ప్రేమో ఏమో
వారు అధరాల
మధువులను పంచుకునేవేల
నగరాన్ని నిదురపుచ్చింది.
రేయి లేదు పగలు లేదు
వారి దారులకు అడ్డేలేదు.

"ప్రతి ఆదికి ఓ అంతముంది"
పై వాక్యం చదవగనే
నాగుండె పగిలింది...
వారువిడిపొతారని అర్థమయ్యింది..
జ్ఞాపకాన్ని విసిరేసాను
జ్ఞాపకాలయాన్ని మూసేసాను 
నిద్రపయనం పట్టాను
అండలూసియా ఆకాశంక్రింద
నారింజ వనంనడుమ   
వసంతంలో ఓరేయిన.        


        

27 January, 2012

చెలివొడిన తలవాల్చి
యుగలగీతాలువింటూ
చెలికబుర్లకు ఊకొడుతూవుంటే
కనురెప్పల సీతాకొకచిలుకలు
కనుపాపల  కుసుమాలపై వాలగా
కమ్మని కలలవిశ్వానికి
తలుపులు తెరుచుకునె..
నిజం కలలో ఓ కల.

నిజం చెపుతున్నా
నేను ఎచెట్టునీడనో
నిదురించాల్సిన వయస్సులో 
నేనో నీడనై
నీడనిచ్చే మహవృక్షాన్నై
వేసవిటెండలకు ఎండి
వానలకు తప్పతడిసాను  
ఒంటరిగా మౌనంగా.
ఇకనైనా వసంతం వచ్చి
నన్ను చిగురింప చెస్తుందేమో.