12 November, 2007

మంచాన పడిన మనసు

నీ తలపుల తుఫానులో
తడిసి తడిసి
మనసు జ్వరంతో
మంచాన పడింది.
నీవైద్యం తప్పనిసరేమో!

నీ ఎదురుచూపుల ఈదరగాలుల్లో
వేచి వేచి
వయస్సు వృద్దాప్యమై
కరిగి పొయింది.
నీ తోడుకోసమేనేమో!  

18 June, 2007

ఎమిటీ విచిత్ర లోకం


ఎమిటీ విచిత్ర లోకం
నీటికి కన్నీటికి తేడాతెలియని లోకం
షావుకారి నివాసం ప్రక్కనే
పేదవాడి ఉపవాసం
కోట్లకోసం ఆరాటం
కూటికోసం పోరాటం
మనషులంటె వీల్లేనా!
మమతలేక బ్రతుకువాల్లు.
ఎమిటీ విచిత్రలోకం
నీటికి కన్నీటికి తేడాతెలియని లోకం
పదవులకోసం మోసాలు
బ్రతకడానికి వేషాలు
నరులంటే వీల్లేనా!
నరుక్కుంటూ బ్రతుకువాల్లు.
ఎమిటీ విచిత్రలోకం
నీటికి కన్నీటికి తేడాతెలియని లోకం

13 February, 2007

అనాధ జీవితం



కోయిల కమ్మని పిలుపులే
అతని దాహాన్ని తీర్చే నీటిధారలు
వసంతంలో వెదజల్లబడె పరిమళాలే
అతని ఉశ్చ్వాస నిశ్చ్వాసములు

నిలుచుని వున్నాడు నిండుకుండలా
చూపులు బారులు తేరిన తేనెటీగల్లా
జీవితం వెక్కిరిస్తూవుంది
ప్రకృతిమాత్రం అహ్వనిస్తూవుంది

పైకిమాత్రం మందహాసం
మనసులోన సుడిగుంఢం
దిక్కుమొక్కులేని అతనిజీవితం
ప్రకృ తికే అంకితం