27 January, 2012

చెలివొడిన తలవాల్చి
యుగలగీతాలువింటూ
చెలికబుర్లకు ఊకొడుతూవుంటే
కనురెప్పల సీతాకొకచిలుకలు
కనుపాపల  కుసుమాలపై వాలగా
కమ్మని కలలవిశ్వానికి
తలుపులు తెరుచుకునె..
నిజం కలలో ఓ కల.

నిజం చెపుతున్నా
నేను ఎచెట్టునీడనో
నిదురించాల్సిన వయస్సులో 
నేనో నీడనై
నీడనిచ్చే మహవృక్షాన్నై
వేసవిటెండలకు ఎండి
వానలకు తప్పతడిసాను  
ఒంటరిగా మౌనంగా.
ఇకనైనా వసంతం వచ్చి
నన్ను చిగురింప చెస్తుందేమో.    
      

2 comments:

  1. శీర్షికా,కవితా రెండూ బాగున్నాయి తమ్ముడూ

    ReplyDelete
    Replies
    1. కృతజ్ఞున్ని...మరిన్ని మీ వ్యాఖ్యలకోసం ఎదురుచూస్తూ

      Delete