25 May, 2011

మనసు తీరాన మొదట
మీరుదిద్దిన అక్షరాలు
కులం
మతం
కట్నం.
అలలు రాక మానవు
తుడిచివేయక మానవు.
నా మనసు శిల్పంపై మొదట
నీను చెక్కిన అక్షరాలు
మనసు
మమత
సమత.
ఏఅలలూ.. రాలేవు
ఏమిచేయలేవు.

19 May, 2011

నేనొక కలువను

నేనొక కలువను.
ఓ కన్నీటిసరస్సుపై
నా కనుల పత్రాల్ని పరిచి
ఒంటరిగా..
మౌనంగా..
పౌర్నమి కోసం ఎదురుచూస్తూ...
వెన్నెల చినుకులు పలకరించగానే
మనుసు పులకరించి విరిసిన కలువను.

నేనొక కలువను.
పూర్తిగా కన్నీటిలో కలువను
వెన్నెల్లో రెక్కలొచ్చి ఎగరను.
వికసించాను
ఇకవాడిపోతాను.
ఈ కన్నీటి మడుగులోనే
కలిసిపోతాను.           

16 May, 2011

పాతస్నేహం

పాతస్నేహం పాతగిల్లె
కొత్తప్రేమల పోకడలకు.
పాతబడెను స్నేహమని
పారవేయబోదురేమో !
మరపు సహజమే మనసా.
మరిచిపొవే మనసా.

పగటికలలు

ప్రేయసి ఒడి
నాకన్నీళ్ళ తడి.
పెదవుల కలయికలు
ఇక పగటికలలు.
నేనొక తీరాన ఎగిసి
క్రుంగిపొయిన అల.
తనకలయిక ఇక కల.

02 May, 2011

యువతరానికెందుకు ?

తరతరాల మీ సంస్కృతి
మా యువతరానికెందుకు ?
అంటరానితనపు మీ అలోచనల్ని
మా వెంటరానీయకు.

మనసులేదు

చేతినిండా ధనముంది.
తలనిండా యుక్తుంది.
మనసునిండా మమతుంది.
కనులనిండా సమతుంది.
మనసివ్వ డానికే... 
మనిషిలేదు.
మనిషుంటే ...
మనసులేదు.