20 July, 2010

తరగని తలపులు

నాలో దుఖ్ఖం నిండినపుడు  
నీవు నన్ను కౌగిలించుకున్నట్లు..
మంచు కురిసినరాత్రిలో వెచ్చదనాన్నిచ్చే
కంబళిలా..నన్ను కప్పేసినట్లు...
నన్ను ఓధార్చినట్లు ...
నే నీవొడిలో సేదతీరినట్లు..
ఏవేవో..మధురాతి మధురమైన
తరగని తలపులు.

21 June, 2010

సమిదై పోలేదా !

మనసులేని మనిషివని 
మరిమరి వేదిస్తావెందుకే.... 
ఇంకేమి మనసే... 
నీ తలపుల దీపాలకు
ఎన్నడో సమిదై  పోలేదా !

15 June, 2010

నేనూ ప్రవహించాను ఓ నదినై

కారణమో.. అకారణమో..
ఆహ్వనమో ..ఏమో...
నేనూ ప్రవహించాను ఓ నదినై
ఈ జనసముద్రం లోనికి. 
కష్టాల కఠినరాళ్ళపై ప్రవహించానో .. 
సుఖాల సుమాలని వికసింపజేశానో .. 
నేనూ ప్రవహించాను ఓ నదినై
ఈ జనసముద్రం లోనికి.
కారణమో.. అకారణమో..
ఆహ్వనమో ..ఏమో...

09 May, 2010

వసంతమా.. వెలుతున్నా....


వసంతం వచ్చింది
కుసుమాల కంబళ్ళను కప్పుకొని.
ఏవో కొన్ని పరిమళాలు
తట్టడిసి మేల్కొలిపాయి
గాఢనిద్రలొవున్న నా వలపుల తలపుల్ని. 
పూల గుత్తులు 
గుసగుసలాడాయి
జీవం లేని
నా ఒంటరి నడకను చూసి. 
లేత పత్రాలు
కన్నీరు పెట్టుకున్నాయి
అడవినపూచిన వెన్నెల
నా యవ్వనమని.
అందుకే వెలుతున్నా
దూరంగా...
వసంతానికి దూరంగా..
గ్రీష్మానికి దగ్గరగా..
వసంతమా నువ్వేవర్ధిల్లని చెప్పి.             

          

22 April, 2010

తొలి చినుకు రాలింది


తొలి చినుకు రాలింది
ఫ్రకృతి వక్షస్సు మీద
ఫ్రకృతి పరవసించింది
పచ్చని పైట జారింది.

తొలి చినుకు రాలింది
నాచెలి అధరాల మీద.
ఏడాదిగా దాగిన ప్రేమ
ఎడుక్షణాల్లొ పెదవులు దాటింది.       

తొలి చినుకు రాలింది
నాచెలి కురుల మీద
చెలి చెవిన వేసింది
నా తలపుల్ని వలపుల్ని.
చెలి హ్రుదయం చేజారింది
నాకౌగిలిలొ సేదతీరింది.  

26 March, 2010

వలపుటక్షరాలు

ఏం చెప్పమంటారే
కన్నెపూవుల్లార!
నామనసు పసివాడు
వలపుటక్షరాల్ని దిద్దాడొ లేదో ...
ఒంటరితనపు వటవ్రుక్షం కింద కూర్చుని
జ్ఞాపకాల మన్నుతింటున్నాడు .
మన్నుతినకు బంగారం
మందం చెస్తుందమ్మా అంటే... 
వినడుకదా!
అమ్రుతమంటాడు.     

మాటవినడమ్మా!
మారం చెస్తాడు
సరిజోడు కావలని 
ఒకటే గొడవ.   

మమతను పంచేటి
ఓ మనసున్నకన్య ఎవరైనా ఉంటే
చెప్పరేమి!
ఆప్పటికైనా
ప్రణయగీతాలు పాడుకుంటూ
మన్నుతినడం మానుకుంటాడేమో!

23 March, 2010

వలపు కుసుమం విరిసింది

రెండు దశబ్ధాల తీపిగుర్తుల్ని
రెండు ఘఢియల్లొ మరిపింపజెసే
ఓ వలపు కుసుమం విరిసింది
నామనసు రెమ్మపై.
ఓ కులుకుతూవెల్లే కన్నెపిల్లల్లారా!
ఒకరైనా నా కుసుమాన్ని కోయరేమి
నా మనసుకు భారాన్ని తగ్గించరేమి.        

19 March, 2010

నా కవిత

నాలొ అప్పుడప్పుడు
శ్వాస ఆగిపొయి
ధ్యాస మారిపోయి
మెదడు సుడిగుండమై
భావాలు మేగాలై
కురిసే ఎడతెరిపిలేని కుండపొతే 
నా కవిత.