10 December, 2006

ప్రేమ


అందం సగం
అంతరంగం సగం
విరహం ప్రాణం
సరసం హ్రుదయం
ప్రేమ అనే తీపిగుర్థుకి.

సుకుమారవతి


కలువలు కనులు తెరుచుకొని
కౌముదిని కౌగిలించుకొను వేళ
రావే నా చెలియా....
వెన్నెల్లో కరిగిపోదామంటే
వెన్నెల వేడిమికి తట్టుకోలేనంది
ఎంతటి సుకుమారవతియో కదా..!

కక్ష్య


నీ ఆలోచనల వేడినీటిలో మరిగి మరిగి
నీ చుట్టూ గ్రహంలా తిరిగి తిరిగి
అలసి పోయి నేను నిశ్చలమై పొతే
కక్ష గట్టి నా కక్ష్యను మార్చేయకే చెలి.

కలానికి అమావాస్య



నాడు కవితలు పాడిన నా కలం కోయిల
నేడు మౌనం దాల్చింది
భావాలు చిగురించ లేదనెమో!
ఉత్సాహ ఉత్పలం విరబూయలేదనేమో!
కలానికి అమావాస్య
కాగితానికి పౌర్ణమి
భావాలకు నిద్ర,జోలపాట,లాలి పాట
భావాలు మల్లీ చిగురిస్తాయ్
కవితల వర్షాలై కురుస్తాయ్
నాడు ప్రపంచమే ఓ చినుకు
ఆ చినుకే నా కవిత.