19 February, 2012

మతాలు కులాలు
మనసుకు వేసిన సంకెల్లు
మనసైన మనషులను
కలుసుకోనీవు
కలిసిన మనషులను
నిలకడగ బతకనీవు.  

12 February, 2012

అండలూసియా ఆకాశంక్రింద
నారింజ వనం నడుమ  
వసంతంలో ఓరేయిన
జ్ఞాపకాలయానికెల్లి
ఓ జ్ఞాపకాన్ని తిరగేస్తే...
అది ఓ జరిగిన కథ
ఆదిలోనే అంతమైన కథ.

పాంప్లొనా వీధుల్లొ
వెన్నెలకురిసిన రాత్రుల్లో 
ఒక ఆంధ్రా అబ్బాయి
ఓ అందమైన అమెరికా అమ్మాయి 
ప్రేమబాసలు చెసుకున్నారు
భాషలు అర్థంకాకున్న.
ప్రకృతి వారి ప్రేమబాసల్ని
వినిందో ఏమో
ప్రకృతికి వారిపై
ప్రేమో ఏమో
వారు అధరాల
మధువులను పంచుకునేవేల
నగరాన్ని నిదురపుచ్చింది.
రేయి లేదు పగలు లేదు
వారి దారులకు అడ్డేలేదు.

"ప్రతి ఆదికి ఓ అంతముంది"
పై వాక్యం చదవగనే
నాగుండె పగిలింది...
వారువిడిపొతారని అర్థమయ్యింది..
జ్ఞాపకాన్ని విసిరేసాను
జ్ఞాపకాలయాన్ని మూసేసాను 
నిద్రపయనం పట్టాను
అండలూసియా ఆకాశంక్రింద
నారింజ వనం నడుమ   
వసంతంలో ఓరేయిన.        


        

07 February, 2012

అయ్యో! పాంప్లొనా
మునిగితివా మంచులోన.
అలసిపోయిన సూరీడు
కొండచాటున కునుకుతీసినవేల
సందుచూసుకుని మంచు
చిందులు వేసె
తెల్లారేలోపే నిన్ను ముంచివేసె. 

వచ్చాడులే సూరీడు
కిరణాస్త్రాలను సందిస్తున్నాడులే.
ముక్కలాయే చూడు మంచు
ఇకనైనా లేయవే
సురీడుని విందుకు పిలవవే.
అయ్యో! పాంప్లొనా
మునిగితివా మంచులోన. 

02 February, 2012

మంచుకు మనసు లేనట్లుంది
గడ్డిని తొక్కేస్తోంది
చెట్లను కప్పేస్తోంది
పదండి పోదాం
గడ్డిపూలకి గొడుగులు పట్టటానికి
ఛెట్లకి దుప్పట్లు కప్పటానికి.

27 January, 2012

చెలివొడిన తలవాల్చి
యుగలగీతాలువింటూ
చెలికబుర్లకు ఊకొడుతూవుంటే
కనురెప్పల సీతాకొకచిలుకలు
కనుబొమ్మల కుసుమాలపై వాలగా
కమ్మని కలలవిశ్వానికి
తలుపులు తెరుచుకునె..
నిజం కలలో ఓ కల.

నిజం చెపుతున్నా
నేను ఎచెట్టునీడనో
నిదురించాల్సిన వయస్సులో 
నేనో నీడనై
నీడనిచ్చే మహవృక్షాన్నై
వేసవిటెండలకు ఎండి
వానలకు తప్పతడిసాను  
ఒంటరిగా మౌనంగా.
ఇకనైనా వసంతం వచ్చి
నన్ను చిగురింప చెస్తుందేమో   
చుస్తా   వేచిచుస్తా.     

28 November, 2011

ఇప్పటిదాక ప్రేమించుకుని
ఇప్పుడే సంగమించుకుంటున్నాయి
రేయింబవల్లు..సంధ్య అంతఃపురాన.

ఓ పక్షుల చెలికత్తెల్లారా !
మీరెక్కల సవ్వడిని ఆపి
అపుడపుడు మీరుపాడే
ఆ యుగలగీతం పాడండి
ప్రతి రోజు మొదటిరోజు
ప్రతిరాత్రి పసిడి రాత్రి.

19 November, 2011

మహాసముద్రాలు కావవి.
మన పూర్వికులు
ఈ భూమికి విడ్కోలు చెప్పడానిని మనసు రాక
రాల్చిన కన్నీటిసముద్రాలు.

31 October, 2011

సప్తసముద్రాలకు
స్వరమైనవాన్ని.
అగ్నిపర్వతాలకు
ఆదినైన వాన్ని.
జలం ఆర్పివేయలేదు
అగ్నిదహించలేదు

16 October, 2011

నేను నా జీవితసంద్రం ఒడ్డున
ఒంటరిగా కూర్చుని
బాధల అలలను లెక్కపెడుతున్నా.... ఒకటి.. రెండు... మూడు... నాలుగు...
అనంతం

17 July, 2011

ఓ మండువేసవి నిశీధిలో..
ఆకలిగొన్న కుక్కల అరుపులు
ఆకాశాన్నంటినవేళ...
మౌనం పొలిమెరలు దాటి
మాయమైన వేళ...
గాలి తలబాదుకొనె
కిటికి కిర్రు కిర్రుమనే.
మనసు బిక్కు బిక్కుమనె.
మరోప్రపంచానికి
వాకిల్లు తెరుచుకొనె.

కంటతడి పెట్టకమ్మా
కన్యగానే 
మరణించానని.
ఇచట కోటి వెన్నెలల
కాంతి తప్ప
మతంలేదు
కులం లేదు
అంటరాని తనం
అసలే లేదు.
కన్నీల్లు లేవు
కట్నపు చావులు లేవు
ఆకలి కేకలు లేవు
మానభంగాల ఊసే లేదు.
ఆడదానికి
కట్టుబాట్ల సంకెల్లు వెసి
నాలుగు గోడల
మధ్యబంధించే
అనాగరికుల ఉనికే లేదు    

కంటతడి పెట్టకమ్మా
కన్యగానే 
మరణించానని..
మల్లి నీకడుపునే పుడితే
విమల అని పేరుపెట్టకు
విప్లవమని పిలువు.
ఓనమాలు దిద్దించకు
శ్రీ శ్రీ మరోప్రపంచాన్ని 
వల్లించు...
విప్లవాల్ని సృస్టిస్తా.
ఈవిశ్వపు అంతు చూస్తా.                                      

12 July, 2011

చేదు ఉత్తరం

పొద్దుపోని వెళల్లో
ఎమిచేయాలో తోచక
ఎలావున్నావని
అడుగుతావు నీవు.
నేను క్షేమం
నీవెలావున్నావని
అడుగుతాను నేను.
రెండుపదాల ఉత్తరానికి
మూడు పదాల ప్రత్యుత్తరం
చేదలు పట్టినప్రేమకు
ఒక చేదు ఉత్తరం. 
    
తుఫాను గాలులలకు
విరిగిపడిన కొమ్మలా
పాతబడిన గోడగడియారంలో
ఆగిపొయిన ముల్లులా
చలనరహితమయ్యానని
రాయాలనుకుంటాను.
కాని రాయను మనసురాదు.
నాకౌగిటి పాఠశాలలో  
ప్రేమభాష నేర్చుకోలేక
నాకు దూరమైన నీకు
వ్యధను పంచుకోవటం వ్యర్థమని   
ఎప్పటిలాగే..
నేను క్షేమం
నీవెలావున్నావని
అడుగుతాను నేను.
రెండుపదాల ఉత్తరానికి
మూడు పదాల ప్రత్యుత్తరం
చేదలు పట్టినప్రేమకు
ఒక చేదు ఉత్తరం.