28 November, 2011

ఇప్పటిదాక ప్రేమించుకుని
ఇప్పుడే సంగమించుకుంటున్నాయి
రేయింబవళ్లు ..సంధ్య అంతఃపురాన.

ఓ పక్షుల చెలికత్తెల్లారా !
మీరెక్కల సవ్వడిని ఆపి
అపుడపుడు మీరుపాడే
ఆ యుగలగీతం పాడండి
ప్రతి రోజు మొదటిరోజు
ప్రతిరాత్రి పసిడి రాత్రి.

17 July, 2011

ఓ మండువేసవి నిశీధిలో..
ఆకలిగొన్న కుక్కల అరుపులు
ఆకాశాన్నంటినవేళ...
మౌనం పొలిమెరలు దాటి
మాయమైన వేళ...
గాలి తలబాదుకొనె
కిటికి కిర్రు కిర్రుమనే.
మనసు బిక్కు బిక్కుమనె.
మరోప్రపంచానికి
వాకిల్లు తెరుచుకొనె.

కంటతడి పెట్టకమ్మా
కన్యగానే 
మరణించానని.
ఇచట కోటి వెన్నెలల
కాంతి తప్ప
కులం లేదు
మతంలేదు
అంటరాని తనం
అసలే లేదు.
కన్నీల్లు లేవు
కట్నపు చావులు లేవు
ఆకలి కేకలు లేవు
మానభంగాల ఊసే లేదు.
ఆడదానికి
కట్టుబాట్ల సంకెల్లు వేసి
నాలుగు గోడల
మధ్యబంధించే
అనాగరికుల ఉనికే లేదు.     

కంటతడి పెట్టకమ్మా
కన్యగానే 
మరణించానని..
మల్లి నీకడుపునే పుడితే
విమల అని పేరుపెట్టకు
విప్లవమని పిలువు.
ఓనమాలు దిద్దించకు
శ్రీ శ్రీ మహప్రస్తానాన్ని  
చదివించు ...
విప్లవాల్ని సృస్టిస్తా.
ఈవిశ్వపు అంతు చూస్తా.                                      

12 July, 2011

చేదు ఉత్తరం

పొద్దుపోని  వేళల్లో
ఎమిచేయాలో తోచక
ఎలావున్నావని
అడుగుతావు నీవు.
నేను క్షేమం
నీవెలావున్నావని
అడుగుతాను నేను.
రెండుపదాల ఉత్తరానికి
మూడు పదాల ప్రత్యుత్తరం
చేదలు పట్టినప్రేమకు
ఒక చేదు ఉత్తరం. 
    
తుఫాను గాలులలకు
విరిగిపడిన కొమ్మలా
పాతబడిన గోడగడియారంలో
ఆగిపొయిన ముల్లులా
చలనరహితమయ్యానని
రాయాలనుకుంటాను.
కాని రాయను మనసురాదు.
నాకౌగిటి పాఠశాలలో  
ప్రేమభాష నేర్చుకోలేక
నాకు దూరమైన నీకు
వ్యధను పంచుకోవటం వ్యర్థమని   
ఎప్పటిలాగే..
నేను క్షేమం
నీవెలావున్నావని
అడుగుతాను నేను.
రెండుపదాల ఉత్తరానికి
మూడు పదాల ప్రత్యుత్తరం
చేదలుపట్టిన ప్రేమకు
ఒక చేదు ఉత్తరం.   

      

25 May, 2011

మనసు తీరాన మొదట
మీరుదిద్దిన అక్షరాలు
కులం
మతం
కట్నం.
అలలు రాక మానవు
తుడిచివేయక మానవు.
నా మనసు శిల్పంపై మొదట
నీను చెక్కిన అక్షరాలు
మనసు
మమత
సమత.
ఏఅలలూ.. రాలేవు
ఏమిచేయలేవు.

19 May, 2011

నేనొక కలువను

నేనొక కలువను.
ఓ కన్నీటిసరస్సుపై
నా కనుల పత్రాల్ని పరిచి
ఒంటరిగా..
మౌనంగా..
పౌర్నమి కోసం ఎదురుచూస్తూ...
వెన్నెల చినుకులు పలకరించగానే
మనుసు పులకరించి విరిసిన కలువను.

నేనొక కలువను.
పూర్తిగా కన్నీటిలో కలువను
వెన్నెల్లో రెక్కలొచ్చి ఎగరను.
వికసించాను
ఇకవాడిపోతాను.
ఈ కన్నీటి మడుగులోనే
కలిసిపోతాను.           

16 May, 2011

పాతస్నేహం

పాతస్నేహం పాతగిల్లె
కొత్తప్రేమల పోకడలకు.
పాతబడెను స్నేహమని
పారవేయబోదురేమో !
మరపు సహజమే మనసా.
మరిచిపొవే మనసా.

పగటికలలు

ప్రేయసి ఒడి
నాకన్నీళ్ళ తడి.
పెదవుల కలయికలు
ఇక పగటికలలు.
నేనొక తీరాన ఎగిసి
క్రుంగిపొయిన అల.
తనకలయిక ఇక కల.

02 May, 2011

యువతరానికెందుకు ?

తరతరాల మీ సంస్కృతి
మా యువతరానికెందుకు ?
అంటరానితనపు మీ అలోచనల్ని
మా వెంటరానీయకు.

మనసులేదు

చేతినిండా ధనముంది.
తలనిండా యుక్తుంది.
మనసునిండా మమతుంది.
కనులనిండా సమతుంది.
మనసివ్వ డానికే... 
మనిషిలేదు.
మనిషుంటే ...
మనసులేదు.

11 January, 2011

నచ్చని నిజాలు


అందహీనుడు
అందమైన ఆడదానికి
చిరకాల స్నేహితుడు.

మనసులు ఒంటరిగా సంభాషించుకునే భాష
ప్రేమ
తనువులు కలిసి నేర్చుకున్న భాష
కామం.
కామంపడ్డ తొందరపాటుకి  
తెలివిగా పెట్టిన పేరు ప్రేమ.

చూపుల కలయిక
ప్రేమ ఆవిర్భావం.
అధరాల కలయిక
కామానికి తొలిమెట్టు.
తనువుల కలయిక పిదప
మనసు తెలిక.