26 March, 2010

వలపుటక్షరాలు

ఏం చెప్పమంటారే
కన్నెపూవుల్లార!
నామనసు పసివాడు
వలపుటక్షరాల్ని దిద్దాడొ లేదో ...
ఒంటరితనపు వటవ్రుక్షం కింద కూర్చుని
జ్ఞాపకాల మన్నుతింటున్నాడు .
మన్నుతినకు బంగారం
మందం చెస్తుందమ్మా అంటే... 
వినడుకదా!
అమ్రుతమంటాడు.     

మాటవినడమ్మా!
మారం చెస్తాడు
సరిజోడు కావలని 
ఒకటే గొడవ.   

మమతను పంచేటి
ఓ మనసున్నకన్య ఎవరైనా ఉంటే
చెప్పరేమి!
ఆప్పటికైనా
ప్రణయగీతాలు పాడుకుంటూ
మన్నుతినడం మానుకుంటాడేమో!

23 March, 2010

వలపు కుసుమం విరిసింది

రెండు దశబ్ధాల తీపిగుర్తుల్ని
రెండు ఘఢియల్లొ మరిపింపజెసే
ఓ వలపు కుసుమం విరిసింది
నామనసు రెమ్మపై.
ఓ కులుకుతూవెల్లే కన్నెపిల్లల్లారా!
ఒకరైనా నా కుసుమాన్ని కోయరేమి
నా మనసుకు భారాన్ని తగ్గించరేమి.        

19 March, 2010

నా కవిత

నాలొ అప్పుడప్పుడు
శ్వాస ఆగిపొయి
ధ్యాస మారిపోయి
మెదడు సుడిగుండమై
భావాలు మేగాలై
కురిసే ఎడతెరిపిలేని కుండపొతే 
నా కవిత.