21 May, 2013


పండంటి పసివాడు
బోసినవ్వులు నవ్వాడు
ఇల్లు పూదోటై వికసించింది. 
పండుముసలివాడు
బోసినవ్వులు నవ్వాడు
మౌనం పాషాణమై
వాడిమనసును హరించింది.      

పండంటి పసివాడు ఏడ్చాడు
పరివారం వాడిపాదాల నిలిచి  బుజ్జగించింది.
పండుముసలివాడుఏడ్చాడు
పట్టించుక్కున్నవారేలే రు.  

పండంటి పసివాడు
అన్నమడిగాడు
వెన్నెలచూపిస్తూ అమ్మ అన్నం తినిపించింది. 
పండుముసలివాడు
ఆకలన్నాడు 
కనినవారులేరు.. వినినవారులేరు. 
అంతే... 
పందిటకు వేలాడింది  
పండువెన్నెల్లో ఒక ప్రాణం.  

తీరాన నిలబడి
అలలను చూస్తూ..
కడలిని మరిచిపొయారు మూర్ఖులు.

2 comments:

  1. ముసలి వాళ్ళు కాదు వాళ్ళూ
    మన మూలాలు వాళ్ళూ
    papa rao amalapuram

    ReplyDelete
  2. వెన్నెల కుడా పుట్టిన పౌర్ణమి నాడే నచ్చుతుంది....వాడిపొయే అమావాస్య రోజు కాదు.
    అలాంటి మనకి చెట్టు వేరులకంటే పువ్వులే నచ్చుతాయి

    ReplyDelete