17 July, 2011

ఓ మండువేసవి నిశీధిలో..
ఆకలిగొన్న కుక్కల అరుపులు
ఆకాశాన్నంటినవేళ...
మౌనం పొలిమెరలు దాటి
మాయమైన వేళ...
గాలి తలబాదుకొనె
కిటికి కిర్రు కిర్రుమనే.
మనసు బిక్కు బిక్కుమనె.
మరోప్రపంచానికి
వాకిల్లు తెరుచుకొనె.

కంటతడి పెట్టకమ్మా
కన్యగానే 
మరణించానని.
ఇచట కోటి వెన్నెలల
కాంతి తప్ప
కులం లేదు
మతంలేదు
అంటరాని తనం
అసలే లేదు.
కన్నీల్లు లేవు
కట్నపు చావులు లేవు
ఆకలి కేకలు లేవు
మానభంగాల ఊసే లేదు.
ఆడదానికి
కట్టుబాట్ల సంకెల్లు వేసి
నాలుగు గోడల
మధ్యబంధించే
అనాగరికుల ఉనికే లేదు.     

కంటతడి పెట్టకమ్మా
కన్యగానే 
మరణించానని..
మల్లి నీకడుపునే పుడితే
విమల అని పేరుపెట్టకు
విప్లవమని పిలువు.
ఓనమాలు దిద్దించకు
శ్రీ శ్రీ మహప్రస్తానాన్ని  
చదివించు ...
విప్లవాల్ని సృస్టిస్తా.
ఈవిశ్వపు అంతు చూస్తా.                                      

No comments:

Post a Comment