17 July, 2011

ఓ మండువేసవి నిశీధిలో..
ఆకలిగొన్న కుక్కల అరుపులు
ఆకాశాన్నంటినవేళ...
మౌనం పొలిమెరలు దాటి
మాయమైన వేళ...
గాలి తలబాదుకొనె
కిటికి కిర్రు కిర్రుమనే.
మనసు బిక్కు బిక్కుమనె.
మరోప్రపంచానికి
వాకిల్లు తెరుచుకొనె.

కంటతడి పెట్టకమ్మా
కన్యగానే 
మరణించానని.
ఇచట కోటి వెన్నెలల
కాంతి తప్ప
మతంలేదు
కులం లేదు
అంటరాని తనం
అసలే లేదు.
కన్నీల్లు లేవు
కట్నపు చావులు లేవు
ఆకలి కేకలు లేవు
మానభంగాల ఊసే లేదు.
ఆడదానికి
కట్టుబాట్ల సంకెల్లు వెసి
నాలుగు గోడల
మధ్యబంధించే
అనాగరికుల ఉనికే లేదు    

కంటతడి పెట్టకమ్మా
కన్యగానే 
మరణించానని..
మల్లి నీకడుపునే పుడితే
విమల అని పేరుపెట్టకు
విప్లవమని పిలువు.
ఓనమాలు దిద్దించకు
శ్రీ శ్రీ మరోప్రపంచాన్ని 
వల్లించు...
విప్లవాల్ని సృస్టిస్తా.
ఈవిశ్వపు అంతు చూస్తా.                                      

12 July, 2011

చేదు ఉత్తరం

పొద్దుపోని వెళల్లో
ఎమిచేయాలో తోచక
ఎలావున్నావని
అడుగుతావు నీవు.
నేను క్షేమం
నీవెలావున్నావని
అడుగుతాను నేను.
రెండుపదాల ఉత్తరానికి
మూడు పదాల ప్రత్యుత్తరం
చేదలు పట్టినప్రేమకు
ఒక చేదు ఉత్తరం. 
    
తుఫాను గాలులలకు
విరిగిపడిన కొమ్మలా
పాతబడిన గోడగడియారంలో
ఆగిపొయిన ముల్లులా
చలనరహితమయ్యానని
రాయాలనుకుంటాను.
కాని రాయను మనసురాదు.
నాకౌగిటి పాఠశాలలో  
ప్రేమభాష నేర్చుకోలేక
నాకు దూరమైన నీకు
వ్యధను పంచుకోవటం వ్యర్థమని   
ఎప్పటిలాగే..
నేను క్షేమం
నీవెలావున్నావని
అడుగుతాను నేను.
రెండుపదాల ఉత్తరానికి
మూడు పదాల ప్రత్యుత్తరం
చేదలు పట్టినప్రేమకు
ఒక చేదు ఉత్తరం.